UPDATES  

 వైరా వర్గ పోరు కు కేటీఆర్ జన్మదిన వేడుకలే సాక్షి తారాస్థాయికి చేరిన తాజా మాజీల మధ్య వర్గ పోరు

 

మన్యం న్యూస్: జూలూరుపాడు, జులై 24, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకల సాక్షిగా వైరా బిఆర్ఎస్ పార్టీ లో వర్గ పోరు మరోసారి బహిర్గతమైంది. ఇందుకు ఇరువర్గాలు వేరు వేరుగా నిర్వహించిన కేటీఆర్ జన్మదిన వేడుకలే సాక్షి. సోమవారం కేటీఆర్ జన్మదినం సందర్భంగా వైరా పట్టణంలో నిర్వహించబోయే వేడుకలకు పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీగా కదిలి రావాలని స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్ పిలుపునిచ్చారు. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ కూడా తన వర్గం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీంతో జూలూరుపాడు మండల కేంద్రంలో ఎమ్మెల్యే రాములు నాయక్ వర్గం బైకు ర్యాలీతో ముందు బయలుదేరగా, మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ తన అనుచర గణంతో భారీ బైక్ ర్యాలీతో తరలిపోయారు. ఒకే పార్టీలో వర్గ పోరు తారాస్థాయికి చేరిందని, దానికి కేటీఆర్ జన్మదిన వేడుకలే వేదికలుగా నిలిచాయని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !