మన్యం న్యూస్, అశ్వారావుపేట, జులై, 24: మండల పరిధిలోని గుమ్మడవల్లి పిహెచ్ సి పరిధిలోని గోపన్నగూడెం గ్రామంలో సోమవారం మెడికల్ క్యాంపు నిర్వహించారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ఆరోగ్య సిబ్బంది ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కన్నాయిగూడెం గ్రామంలో మెడికల్ చెకప్ లు నిర్వహిస్తూ రోగ నిర్ధారణ చేసి వైద్య సేవలు అందించారు. వర్షాకాలంలో ప్రజలు పాటించవలసిన జాగ్రత్తలు, ప్రబలుతున్న సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో కన్నాయిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ గొంది లక్ష్మణరావు, ఏఎన్ఎం లు రాధాబాయ్, స్వరూప, మెడికల్ స్టాప్ మరియు ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.