- మండలంలో ఎమ్మెల్యే మెచ్చా విస్తృత పర్యటన
- ఘనంగా కెటిఆర్ జన్మదిన వేడుకలు
- డ్రైనేజ్ పనులను కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే మెచ్చా
- మెగా జాబ్ మేళా ను ప్రారంభించిన ఎమ్మెల్యే మెచ్చా
మన్యం న్యూస్, అశ్వారావుపేట, జులై, 23: స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో ఘనంగా మంత్రి కెటిఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. అనంతరం బీసీ గురుకుల బాయ్స్ పాఠశాలలో విద్యార్థులకు బిస్కెట్ లు మరియు చాక్లెట్ లు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే కోరిక మేరకు ఎంపీ నామా నాగేశ్వరరావు అశ్వారావుపేటలోనీ వేముల నాగేశ్వరరావు బజార్ లో 10లక్షల రూపాయలతో డ్రైనేజ్ ఏర్పాటు కొరకు నిధులు మంజూరు చేయగా స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం రాజ్య సభ సభ్యులు హెట్రో డ్రగ్స్ సంస్థ అధినేత బండి పార్థ సారథి రెడ్డి నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కొరకు కృషి చేయాలని వికేడివిఎస్ రాజు డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయగా దానిని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ను హెట్రో సంస్థ వారు ఘనంగా సన్మానించారు. అలాగే ఎమ్మెల్యే మెచ్చా ఎంపీ బండి పార్థ సారథి రెడ్డికి ప్రజల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి, జెడ్పీటీసీ శెట్టి వరలక్ష్మి, దమ్మపేట జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, అన్నపురెడ్డిపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.