మన్యం న్యూస్ గుండాల: గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య కోరారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రజాపంథా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోడు రైతుదారులందరికీ పట్టాలిస్తానన్న ప్రభుత్వం నాలుగు లక్షల ఎకరాలనే పంపిణీ చేసిందన్నారు. అర్హులైన గిరిజనేత్రులందరికీ పట్టాలి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలో గిరిజన చట్టాలు సక్రమంగా అమలు కాకపోవడం వలన గిరిజనులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకోస్తున్న అటవీ సంరక్షణ 2022 చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం గిరిజనులు గిరిజన ఇతరుల మధ్య తగు పెట్టే విధంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్, పార్టీ నాయకులు నాయని రాజు, శంకరన్న, మాజీ సర్పంచ్ శాంతయ్య, వాంకుడోత్ అజయ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు
