మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
ఇంటింటా ఇన్నోవేటర్ ఆవిష్కరణలను వాట్సప్ ద్వారా పంపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్
ప్రియాంక అల తెలిపారు. ఇంటింటా ఇన్నోవేషన్ లో వినూత్న ఆవిష్కరణలు దరఖాస్తు చేయు ప్రక్రియపై సోమవారం ఐడిఓసి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఔత్సాహికులు ఆవిష్కరణలలో తమ ప్రతిభను చాటుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లుగా ఇంటింటా ఇన్నోవేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పలు ఆవిష్కరణల ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ఆవిష్కరణ విద్యార్థుల ఆవిష్కరణ వ్యవసాయ రంగ ఆవిష్కరణలు సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల ఆవిష్కరణలు తదితర అంశాలు దరఖాస్తు చేసేందుకు అవకాశం ఉన్నట్లు చెప్పారు. ప్రదర్శన యొక్క అవిష్కరణపై రెండు నిమిషాల నిడివి గల వీడియో ఆవిష్కరణ నాలుగు ఫోటోలు ఆరు వాక్యాలతో ఆసక్తి గల ఔత్సాహికులు 9100678543 నెంబర్‌కు వాట్సప్ ద్వారా వృత్తి ఊరి పేరు జిల్లా పేరుతో వివరాలను పంపించాలన్నారు. ఆవిష్కరణలు
ఆగస్టు 5 లోగా పంపాల్సివుందని కలెక్టర్ పేర్కొన్నారు. అన్నిశాఖల అధికారులు దరఖాస్తు చేయుటపై సమాచారం క్షేత్రస్థాయి వరకు చేరవేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, మధుసూదన్ రాజు, పరిశ్రమల శాఖ జియం సీతారాం, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.