మన్యం న్యూస్ చర్ల:
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు
కల్వకుంట తారక రామారావు పుట్టిన రోజు సందర్భంగా చర్ల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోయం రాజారావు ఆధ్వర్యంలో చర్ల పార్టీ కార్యాలయంలో కేటీఆర్ జన్మదిన వేడుకలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోయం రాజారావు మాట్లాడుతూ తెలంగాణ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ అని, రాష్ట్ర అభివృద్ధికి పేదలకు అండగా ఎప్పుడు ఉండే గొప్ప నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చర్ల సర్పంచ్ కాపుల కృష్ణార్జున రావు, ఇరస వడ్ల రాము, ఉపాధ్యక్షులు పోలిన లంకరాజు, ప్రచార కార్యదర్శి కోటేరు శ్రీనివాస్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ పోలిన చందర్రావు, బిసి సెల్ అధ్యక్షుడు దొడ్డి సూరిబాబు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు తోటమల్ల వరప్రసాద్, యూత్ అధ్యక్ష కార్యదర్శులు కాకి అనిల్, నేర్రబోయిన చంద్రశేఖర్, ఎంపీటీసీ మీడియం శోభారాణి, సర్పంచ్ కోరం నాగేంద్ర,ఉప సర్పంచ్ గోసుల మురళి,తెగడ ఉప సర్పంచ్ శ్యామల శివ, పార్టీ సీనియర్ నాయకులు దొడ్డి తాతారావు, తడికల లాలయ్య,అజీజ్, ఈశ్వర్, మరియు పార్టీ సోషల్ మీడియా ఇంచార్జీ పంజా రాజు, నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.