మన్యం న్యూస్ చండ్రుగొండ జులై 24 : మండల కేంద్రంలో మణిపూర్ లో గిరిజన మహిళను నగ్నంగా ఊరేగించి అతికిరాతకంగా అత్యాచారం చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని, నిరసిస్తూ ఆదివాసి జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ…. మణిపూర్ లో జరిగిన ఘటనను దేశవ్యాప్తంగా ప్రతి భారతీయుడు సిగ్గుపడాల్సిన విషయమని, మహిళా చట్టాలను పటిష్టంగా చేయాలని, ఘటనకు సంబంధించిన దోషులను ఉరిశిక్ష వేయాలని, కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ ఈ ఘటనను బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గనాయకులు వగ్గేల పూజ, జారే ఆదినారాయణ, జెడ్పిటిసి కోణకండ్ల వెంకటరెడ్డి, ఎంపీపీ బానోత్ పార్వతి, వైస్ ఎంపీపీ నరకళ్ళ సత్యనారాయణ ,అంకిరెడ్డి కృష్ణారెడ్డి, సారేపల్లి శేఖర్, కేశ బోయిన నరసింహారావు, ఆదివాసి జేఏసీ నాయకులు కుంజా వెంకటేష్, కొడెం నరసింహారావు, పద్దం యశోద, బోర్ర సురేష్, మల్లం కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.