UPDATES  

 బూర్గంపహాడ్ పట్టణంలో ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు.

మన్యం న్యూస్ బూర్గంపహాడ్:- పినపాక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆదేశాల మేరకు సోమవారం బూర్గంపహాడ్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సోహెల్ పాషా ఆధ్వర్యంలో కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక సర్పంచ్ సిరిపురపు స్వప్న మరియు పార్టీ యువజన మండల అధ్యక్షులు గోనెల నాని పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు,బ్రెడ్ లు అందజేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సోహెల్ పాషా,మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు సాదిక్ పాషా,నామ యూత్ జిల్లా నాయకులు దుద్దుగూరి రాజా,మండల ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రహ్మణ్యం,మాజీ జెడ్పిటిసి భూపల్లీ నరసింహారావు,మాజీ ఎంపిటిసి మేకల నరసింహారావు,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు మందా ప్రసాద్,గ్రామపంచాయతీ వార్డు సభ్యులు శోకత్ అలీ,సంపత్,యువజన నాయకులు తోకల సతీష్,బాసిపోయిన గంగరాజు,కుమ్మరిపల్లి నాగరాజు,మైనార్టీ నాయకులు షహబాజ్,సత్తార్,ఖయ్యుమ్,అమీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !