UPDATES  

 ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులపై అధికారులు చిత్తశుద్ధితో స్పందించాలి

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులపై అధికారులు చిత్తశుద్ధితో స్పందించాలి
– దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలి
– కలెక్టర్ ప్రియాంక అలా

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
ప్రజావాణిలో సమస్యను పరిష్కరించాలని ప్రజలు అందచేసిన పిర్యాదులు పరిష్కారానికి అధికారులు
తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో
అన్ని శాఖల జిల్లా అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల
నుండి పిర్యాదులు స్వీకరించి పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిర్యాదుదారునికి సమస్య పరిష్కార స్వభావాన్ని ఫోన్ చేసి తెలియచేయాలని చెప్పారు. ప్రజావాణిలో సమస్య పరిష్కారం కోరుతూ ప్రజలు అందచేసిన వినతులు కొన్ని ఇలా ఉన్నాయి. చుంచుపల్లి మండలం రాంనగర్కు చెందిన రవీందర్ దివ్యాంగుల కోటాలో తనకు రెండు పడక గదుల
ఇల్లు మంజూరు చేయాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం డిఆర్డీఓకు ఎండార్స్ చేశారు.
పినపాక మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన లక్కి స్వరూప సీతారాంపురం రెవిన్యూ గ్రామ
సర్వే నెం.670/18 విస్తీర్ణం 20 కుంట భూమి బిటిపిఎస్ నిర్మాణంలో కోల్పోయానని తనకు బిటిపిఎస్ నందు
ఉద్యోగ అవకాశం కల్పించాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం కలెక్టరేట్ లోని భూ సేకరణ విభాగపు
పర్యవేక్షకునికి ఎండార్స్ చేశారు.
బూర్గంపాడు మండలం అంబేద్కర్ నగర్ గ్రామానికి చెందిన పద్మ తన భర్త అనారోగ్యంతో
భాదపడుతుతన్నాడని, కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని, తన ఇద్దరు ఆడపిల్లల
పోషణకు ఇబ్బంది పడుతున్నామని భర్తకు వైద్యం చేయించలేక ఇబ్బందులు పడుతున్నానని తనకు ఏదేని
ప్రభుత్వ శాఖలో ఉపాధి అవకాశం కల్పించాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం జిల్లా
ఉపాధికల్పనాధికారికి ఎండార్స్ చేశారు.
భద్రాచలం పట్టణం కొర్రాజులగుట్టకు చెందిన తుత్తరపుడి వసంత తనకు చిల్ల కొట్టు, ఫ్యాన్సీ దుకాణం
ఏర్పాటు చేసుకోవడానికి దళితబంధు మంజూరు చేయాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు
చర్యలు నిమిత్తం ఎస్సి కార్పోరేషన్ ఈడికి ఎండార్స్ చేశారు.
దమ్మపేట మండలం లచ్చాపురం గ్రామానికి చెందిన తోట సత్యనారాయణ ఎస్టీ నాయకపోడు తెగకు
చెందిన తాను, ఎంఏ బిఈడి చేసిన తాను కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నానని 2020-21లో
కోళ్లఫారం నిర్మాణ పనులు చేపట్టానని ఆర్థిక స్థోమత సరిపోకపోవడం వల్ల పనులు చివరి దశలో ఆగిపోయాయని తన తల్లి పేరున ట్రైకార్ రుణానికి దరఖాస్తు చేసుకున్నానని అట్టి దరఖాస్తు వివరణ ఇంతవరకు
తెలియలేదని పేర్కొంటూ ట్రైకార్ రుణం మంజూరు చేయాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం
గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులకు ఎండార్స్ చేశారు.
టేకులపల్లి మండలం బర్లగూడెం గ్రామానికి చెందిన పూనెం వెంకటేశ్వరావు 40 సంత్సరాల నుండి
పోడు వ్యవసాయం చేసుకుంటున్నానని తనకు పోడు పట్టా రాలేదని పోడు పట్టా మంజూరు చేపించాలని
చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం కలెక్టరేట్ ఈ సెక్షన్ పర్యవేక్షకులకు ఎండార్స్
చేశారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, మధుసూదన్
రాజు, అన్ని శాఖల జిల్లా
అధికారులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !