మన్యంన్యూస్ ఇల్లందురూరల్:- ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు, ఇల్లందు – కొత్తగూడెం ప్రధాన రహదారి పై ఆరోవమైలు దగ్గర బారి వృక్షం కూలిపోయి ప్రధాన రహదారికి అడ్డుగా పడిపోయింది. దాంతో అటుగా వెలుతున్న వాహనాలు రెండు గంటలపాటు నిలిచిపోయి, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. సంబంధిత అధికారులకు సమాచారం అందించగా సకాలంలో స్పందించిన అధికారులు చెట్టును తొలగించి రోడ్డు క్లియర్ చేశారు.