UPDATES  

 మణిపూర్ ఘటన దోషులను కఠినంగా శిక్షించాలి..

మణిపూర్ ఘటన దోషులను కఠినంగా శిక్షించాలి..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను దగ్ధం చేసిన సిపిఎం, సిపిఐ నాయకులు..

మన్యం న్యూస్ దుమ్ముగూడెం జులై 25::
మణిపూర్ రాష్ట్రంలో మహిళలను నగ్నంగా ఊరేగించిన వారిని కఠినంగా శిక్షించాలని సిపిఎం సిపిఐ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం నాడు మండల కేంద్రంలోని లక్ష్మీనగరం గ్రామంలో మణిపూర్ ఘటనపై సిపిఐ సిపిఎం పార్టీలు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఘటనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వైఫల్యానికి నిరసనగా ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నియోజకవర్గ కో కన్వీనర్ కారం పుల్లయ్య, సిపిఐ జిల్లా సమితి సభ్యులు నోముల రామిరెడ్డి మాట్లాడుతూ దోషులను కఠినంగా శిక్షించాలని మణిపూర్ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని గాలికి వదిలేసి దుండగుల చేతిలో పెట్టిందని అందుకు నిదర్శనమే మహిళను నగ్నంగా నడిరోడ్డు మీద ఊరేగించడం అని మండిపడ్డారు అత్యాచారం జరిగి ఇన్ని రోజులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం ప్రజాస్వామ్యం మీద వాళ్లకున్న పాలనకు నిదర్శమని ఈ బీజేపీ ప్రభుత్వం మతోన్మాదం ప్రభుత్వమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం, మోడీ మౌనం చేతగానితనం కారణంగానే మణిపూర్ లో ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల సహాయ కార్యదర్శి తాటుపూడి రమేష్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిలకమ్మ, చంద్రయ్య, శీను బాబు, గుడ్ల రామ్మోహన్ రెడ్డి, చంటి, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !