మన్యం న్యూస్ చండ్రుగొండ జులై 25 : మండల పరిధిలోగల రైతులకు తెలియజేయునది ఏమనగా, వ్యవసాయ శాఖ ఏడిఏ అబ్సల్ బేగం మంగళవారం పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తూ.. గత వారం రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు పత్తి చేలల్లో నీరు నిలవకుండా కాలువలు తీసుకోవాలని, ఎరువులు, పురుగుమందులు, స్ప్రే చేయరాదని, ముఖ్యంగా బోర్ మోటార్ల, కరెంటు స్తంభాల వద్ద నీరు లేకుండా చూడాలని, వరి రైతులకు పొలాలలో యధావిధిగా పనులు చేసుకోవాల్సిందిగా, రైతులకు సూచనలు ఇవ్వడం జరిగింది.