మన్యంన్యూస్ ఇల్లందురూరల్:- యూ ట్యూబ్, ఇన్స్ట్ర గ్రామ్ రీల్స్ అన్నా చెల్లెలి మధ్య గొడవకు దారి తీయటం, ఆపై చెల్లి ప్రాణాలు పోవడం వరకు తెచ్చిన దురదుష్ట కర ఘటన ఇల్లందు మండల పరిధిలోని రాజీవ్ నగర్ తండాలో జరిగింది. అజ్మీరా సంఘవి ఇంటివద్ద నుండి వెల్లివస్తూ మహబూబాబాద్ లో నర్సింగ్ కోర్సు చదువుతుంది. కాలీ సమయాల్లో తరుచూ యూట్యూబ్ లో రీల్స్ చేస్తుండేది.రీల్స్ చెయ్యొద్దంటూ సంఘవి ని అన్నయ్య హరి పలుమార్లు వారించాడు, గొడవపడ్డాడు. సంఘవి అంతటితో ఆగకపోవటంతో ఇద్దరిమద్య గొడవ జరిగింది. కోపంగా ఉన్న హరి రోకలితో సిందు తలపై కొట్టాడు. తలకు తీవ్రంగా గాయం కావటంతో వైద్యసహాయం నిమిత్తం దగ్గరలోని ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి అటుపై ఖమ్మం మమత హాస్పిటల్ కి తరలించారు అక్కడి వైద్యుల సూచనతో వరంగల్ తరలిస్తుండగా సంఘవి ప్రాణం వదిలింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు హరిని అరెస్ట్ చేశారు.