మన్యం న్యూస్ చర్ల:
చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని క్రాంతి పురం, కొత్తపల్లి, దండుపేట గ్రామాలలో డాక్టర్ శ్రీధర్, డాక్టర్ ఆశ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం జరిగినది.
క్రాంతి పురం గ్రామంలో డాక్టర్ శ్రీధర్ కాలినడకన వాగులు దాటి ఇంటింటికి వెళ్లి నిలువ నీరు ఉండటం వలన దోమలు వృద్ధి చెందే అవకాశం ఉందని తెలియజేస్తూ ప్రతి మూడు రోజులకు ఒకసారి వర్షం పడిన నీరు నిలువ ఉంచిన నీటిలో దోమలు గుడ్లు పెట్టే అవకాశం ఉన్నందున ఆ నీటిని పారవేసి కొత్త నీటిని పట్టుకోవాల్సిందిగా తెలియజేయడమైనది.
అలాగే గ్రామంలోని గర్భవతి ఇంటిని
సందర్శించినప్పుడు ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది ఐరన్ మాత్రలు వేసుకుంటున్నవా లేదా మా సిబ్బంది గృహ సందర్శన చేస్తున్నారా లేదా అనే విషయాలు అడగడం జరిగింది.తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయడం జరిగినది.వర్షాకాల సమయంలో కాచి చల్లార్చిన నీళ్లు తాగవలెనని వేడివేడి ఆహార పదార్థాలు తినవలెను దోమ కాటు నిండు రక్షించుకొనుటకు దోమతెరలు వాడవలనని ఆరోగ్య విద్యా బోధన చేయటం జరిగినది.ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీధర్ , సిహెచ్ఓ రామలక్ష్మి , ముత్యాల రావు హెచ్ ఈ ఓ వేణుగోపాలకృష్ణ, సూపర్వైజర్లు పుష్పావతి, ప్రసాద్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
