మన్యం న్యూస్ దుమ్ముగూడెం/ చర్ల, జూలై 25::
రోకలి బండతో వ్యక్తిపై దాడి చేసి హత మార్చిన సంఘటన చర్ల మండలం అంబేద్కర్ నగర్ కాలనీలో చోటుచేసుకుంది. మృతుడి భార్య తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన చెప్పనపల్లి కాంతారావు కు ఇరువురు కుమారులు చిన్న కుమారుడైన నాగేంద్రబాబు వరుసకి బావ అయినటువంటి కునుకు సంతోష్ కు సోమవారం మధ్యాహ్నం ఒక ఫంక్షన్ లో మద్యం మత్తులో గొడవ జరిగింది. అనంతరం ఆ గొడవని వారి బంధువులకు సమక్షంలో సద్దుమణిగించారు తాగిన మైకంలో ఇదే మనసులో పెట్టుకున్న సంతోష్ రాత్రి 11 గంటలకు సమయంలో నాగేంద్రబాబు ఇంటికి వెళ్లి పడుకున్న వ్యక్తిని రోకలి బండతో తలపై గట్టిగా కొట్టాడు వెంటనే గమనించిన భార్య కేకలు పెడుతూ చుట్టుపక్కన వాళ్ళని పిలిచింది అప్పటికే బలంగా తల మీద కొట్టడంతో రక్తస్రావం బాగా జరిగింది. ఇప్పుడు వచ్చి కొట్టమంటూ సంతోష్ అక్కడి నుంచి పారిపోయాడు, వెంటనే కుటుంబ సభ్యులు నాగేంద్ర బాబు చికిత్స కోసం భద్రాచలం హాస్పిటల్కు తరలించగా అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వరంగల్ కు పంపించారు. మంగళవారం నాడు నాగేంద్రబాబు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు చర్ల పోలీస్ ఎస్ఐ టి వి ఆర్ సూరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు