- సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి..
- ఆశ్రమ పాఠశాలలు , అంగన్వాడి, ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతిన్ జైన్..
మన్యం న్యూస్ దుమ్ముగూడెం/చర్ల, జులై 25::
వర్షాకాలం సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్ అన్నారు. మంగళవారం నాడు చర్ల మండలంలోని ఉంజ్జుపల్లి, పెద్దముసిలేరు ఆశ్రమ పాఠశాలలను ఆకస్మికంగా తనఖి చేశారు. వాతావరణం మారినందున గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అందుకు సంబంధిత హెచ్ఎం లు వార్డెన్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. పాఠశాలలోని తరగతి గదులు డైనింగ్ హాల్ డార్మెటరీ పిల్లల లైబ్రరీ రూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు సమయానుకూలంగా మెను ప్రకారం భోజనము అందించాలని పాఠశాలల్లోని టాయిలెట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని శానిటేషన్ పరంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వర్షాకాలం నడుస్తున్నందున రాత్రిపూట పిల్లలు ఎవరు బయటికి రాకుండా చూడాలని విషపూరితమైన క్రిమి కీటకాలు సంచరిస్తూ ఉంటాయని పిల్లల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే పిల్లలు యొక్క విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వాతావరణం మార్పు వలన పిల్లలు అస్వస్థతకు గురి కావచ్చు అని పాఠశాలల్లో సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఎవరైనా విద్యార్థులు అస్వస్థతకు గురి అయితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించాలని ప్రతి విషయాన్ని పై అధికారులకు తెలియజేయాలని అన్నారు. ఉంజ్జుపల్లి ఆశ్రమ పాఠశాలలో లైబ్రరీ నిర్వహణ తీరు సరిగా లేదని హెచ్ఎం పై మండిపడుతూ లైబ్రరీ కొరకు ప్రత్యేక గదిని కేటాయించాలని ప్రధానోపాధ్యాయులు సిబ్బంది అందరూ స్థానికంగా ఉండాలని అన్నారు. అనంతరం పిల్లల చేత బేసిక్స్ స్కిల్ల్స్ ను వారి చేత చదివించి ఇంకా పిల్లలు బేసిక్స్ స్టిల్స్ పట్ల ఇంప్రూవ్ కావాలని ఆ దిశగా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పిల్లలకు నేర్పించాలని అన్నారు. అనంతరం పెద్ద మిడిసిలేరు పాఠశాలలోని విద్యార్థిని ల యొక్క తరగతి గదులు పరిశీలించి వారితో కలిసి భోజనం చేసారు. అనంతరం చర్ల, కొయ్యూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి రికార్డులను పరిశీలించి వర్షాకాలం సిజనల్ వ్యాధులు ప్రజలే అవకాశం ఉన్నందున డాక్టర్లు వైద్య సిబ్బంది స్థానికంగా ఉండి గిరిజనులకు ప్రత్యేక వైద్య చికిత్సలు చేయాలని సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారూ.అనంతరం తేగడ అంగన్వాడి సెంటర్ ను సందర్శించి అంగన్వాడి సెంటర్ కు వచ్చే చిన్నారులకు న్యూట్రిషన్ ఫుడ్ సక్రమంగా అందించాలని, చిన్నారుల విషయంలో మాత్రం అంగన్వాడీ టీచర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతిరోజు వారి యొక్క కదలికలను గమనించి ఆహారం అందిస్తూ ఉండాలని హిమోగ్లోబిన్ తగ్గకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉంజ్జుపల్లి హెచ్ఎం సాయన్న పెద్దముసిలేరు హెచ్ఎం చంద్రకళ, డాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.