UPDATES  

 భారీ కొండచిలువ చికెన్ షాప్ లో హల్ చల్

 

మన్యం న్యూస్, అశ్వరావుపేట, ఆగష్ట్, 02: మండల పరిదిలోని వినాయకపురం గ్రామంలో ఇర్ఫాన్ భాష అనే చికెన్ వ్యాపారి షాపులో బుధవారం ఉదయం ఓ భారీ కొండ సిలువ ప్రవేశించి హల్చల్ చేసింది. ఎప్పటిలాగానే రాత్రి పూటా షాప్ బంద్ చేసి ఉదయం చికెన్ షాప్ తీసేందుకు వచ్చిన చికెన్ షాప్ ఓనర్, లోపలికి వెళ్ళగా కొండచిలువ కనిపించింది, అప్పటికే ఆ కొండ చిలువ రెండు కోళ్ళని మిగేసింది, భయాందోళనకి గురి అయ్యేనా షాప్ యజమాని పక్కనే ఉన్న షాపుల వారందరినీ పిలిచాడు. స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆ కొండచిలువను అడవిలో విడిచిపెట్టారు. ఈ కొండ చిలువను చూసేందుకు స్థానికలు పలువురు ఆసక్తి కనబరిచారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !