మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- ఇల్లందు నియోజకవర్గ పరిధలోని ముత్తారకట్టా, శాంతినగర్ గ్రామపంచాయతీ చెందినటువంటి 80 కుటుంబాలు బుధవారం బిఆర్ఎస్ పార్టీలో చేరారు. కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీల నుంచి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. పార్టీలో చేరిన వారినీ ఇల్లందు శాసన సభ్యురాలు బానోత్ హరిప్రియ నాయక్ గులాబీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. చేరికల సందర్బంగా మాట్లాడిన ఎమ్మెల్యే హరిప్రియ రాష్ట్రంలో ప్రతి గడపగడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బారి ఎత్తున బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. జాతీయ రాజకీయాల్లోకి బిఆర్ఎస్ తప్పక రాణిస్తుందని, భవిష్యత్తులో సీఎం కేసీఆర్ దేశ్ కి నేత కావడం తద్యం అన్నారు. కార్యకర్తల సంక్షేమం కోరకు బిఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉన్నదని తెలిపారు. ప్రజల ఆశీస్సులతో సీఎంగా కెసిఆర్ బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలిపారన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
ప్రజలు వాస్తవ పరిస్థితులను గమనిస్తున్నారని విపక్షాల మోసపూరిత మాటలు వినే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు. విపక్ష నాయకులు ప్రభుత్వ పథకాలు, ప్రజల సంక్షేమం చూసి తట్టుకోలేక బిఆర్ఎస్ పార్టీపై అసత్య ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి రాష్ట్ర సలహాదారులు పులి గళ్ళ మాధవరావు, డిసిసిబి డైరెక్టర్ జనగం కోటేశ్వరరావు, వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్ బీఆర్ఎస్ పార్టీ ఇల్లందు మండల అధ్యక్షులు శ్రీలం రమేష్, ఖమ్మంపాటి రేణుక, సర్పంచ్ లు మంకిడి కృష్ణ, నందు నాయక్, పిఎసిఎస్ డైరెక్టర్ నునావత్ లస్కర్, బానోత్ కృష్ణ, భానోత్ శ్రీను,రామటెంకి లక్ష్మీనారాయణ,
కల్తీ శ్రీరాములు, పొడుగు శ్రీరాములు, బుచ్చి రాములు తదితరులు పాల్గొన్నారు.