మన్యం న్యూస్ చండ్రుగొండ ఆగస్టు 02 : మండల కేంద్రంలో బిజెపి పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కోనేరు చిన్ని జన్మదిన వేడుకలు మండల అధ్యక్షుడు భోగి కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని మండలాలలో బిజెపి పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేస్తున్న జిల్లా అధ్యక్షుడు కోనేరు చిన్ని( సత్యనారాయణ) జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు నీలవర్ణ, గుగులోతు రాంబాబు, మండల ఉపాధ్యక్షుడు కుక్కడవు రామారావు, గుగులోతు రాజేష్ నాయక్, జంగా సత్యనారాయణ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు భూఖ్య రామ్ పండు, గిరిజన మోర్చా మండల అధ్యక్షుడు తేజావత్ సురేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.