మన్యం న్యూస్ బూర్గంపహాడ్:- భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ ఏర్పాట్లు పరిసిలించడానికి వస్తున్న క్రమంలో పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ వృద్ధురాలు నడవలేక పోతు నడుస్తుండగ అది గమనించిన పాల్వంచ సర్కిల్ ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్ ఆమె వద్ద ఆగి అవ్వ ఏక్కడికి పోతున్నావు అని ఆప్యాయంగా పలకరించారు.ఆమె మందుల దుకాణం వద్దకు గోళీలకోసం వెళ్తున్న అయ్యా అని సిఐ గారికీ సమాధానం ఇచ్చింది.రా అవ్వ మందుల దుకాణం వద్దకు వెళ్దాం నికు గోళీలు ఇప్పించి మీ ఇంటి దగ్గర దిగబెడతా అని అన్నారు.ఆమె దండాలయ్యా మా ఇల్లు ఈ సమీపంలో దగ్గర్లోనే ఉంది వెళ్తానయ్య అని సమాధానం ఇచ్చింది.దీంతో సిఐ వినయ్ కానిస్టేబుల్ నీ పిలిచి ఈ అవ్వకు గోళీలు ఇప్పించి ఇంటి దగ్గర దిగబెట్టమని ఆదేశించారు.దీంతో సమీపంలో ఉన్న ప్రజలు చూసి సిఐ గారు మానవతావాది అని చర్చించుకున్నారు.పాల్వంచ సర్కిల్ పరిధిలో ఎన్నో సేవా కార్యక్రమాలను సిఐ వినయ్ కుమార్ పల్పంచుకుంటునే ఉన్నారు.