మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఆగస్టు 02::
మండలంలోని ఆర్లగూడెం ఆశ్రమ పాఠశాలలో బుధవారం స్థానిక దుమ్ముగూడెం వైద్యశాల ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక వైద్యాధికారి డాక్టర్ పుల్లారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య సేవలను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కండ్ల కలక అంటువ్యాధిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు, కండ్ల కలక నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు విద్యార్థులకు వివరించారు. కండ్ల కలక నివారణ మందులు,కంటి చుక్కల మందు వాడకంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సాగర్, హెచ్వి శ్యామలత,ఏఎన్ఎం నరసమ్మ, గంగమ్మ, ఆశా కార్యకర్త వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.