మన్యం న్యూస్ బూర్గంపహాడ్:- భద్రాద్రి జిల్లా దిశ ప్రొటేక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ చైర్మన్ బి.వి రాజు,జిల్లా అధ్యక్షురాలు మద్దెల అన్నపూర్ణ ఆదేశాల మేరకు బూర్గంపహడ్ మండల పరిధిలోని సారపాక గ్రామ పంచాయతిలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గొన్న దిశ కమిటీ సభ్యులు గ్రామ పంచాయతి పరిధిలో బెల్టుషాపులు,వైన్ షాపులు నిర్మూలించడమే మా ఎజెండా అని దీనికి ఎవరు సహకరించవద్దు అని,దిశ మహిళలు తీవ్రంగా మండిపడ్డారు ఈ కార్యక్రమంలో ముక్త కంఠంతో కండించారు.ఈ కార్యక్రమంలో పలు అధికారులు,పలు పార్టీల నాయకులు మరియు దిశ ప్రొటేక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కందుల సుజాత,పినపాక నియోజకవర్గం జాయింట్ సెక్రెటరీ ముదిగొండ వరలక్ష్మి,అధికార ప్రతినిధి హలావత్ శారద,మంగ తదితరులు పాల్గొన్నారు.