మన్యం న్యూస్ చర్ల:
చత్తీస్గడ్ సరిహద్దులో గల అతి మారుమూల ప్రాంతమైన పూసుగుప్ప గ్రామంలో డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగినది. ఈ వైద్య శిబిరానికి వచ్చిన
గర్భవతులకు ఆరోగ్య పరీక్షలు చేసి ఐరన్, కాల్షియం మాత్రలు వాడుతున్నారా లేదా ప్రమాదభరితమైన లక్షణాలు ఏమన్నా ఉన్నాయా లేదా పరిశీలించి, అడిగి తెలుసుకున్నారు. అలాగే తేలికపాటి రుగ్మతలకు చికిత్స కూడా చేయడం జరిగింది.
అలాగే స్కూల్ పిల్లలను పరీక్ష చేసి గాలి ద్వారా, నీటి ద్వారా మనం వాడిన వస్తువుల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి అయిన కండ్ల కలక గురించి ఇది ఒక వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది వైరస్ అంటే ఒక జిగటలాంటి బంకే కనుక మనము తరచూ చేతులను పరిశుభ్రంగా చేసుకుంటే మరియు కళ్ళలో దురదలు వచ్చినప్పుడు చేతులను బట్టలు ఉపయోగించి నిలవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా అలాగే వ్యాధి సోకిన తర్వాత ఒంటరిగా నలుగురు తిరిగే ప్రదేశంలో ఉండకుండా వ్యాధి వ్యాప్తిని తగ్గినంతవరకు చికిత్స తీసుకుంటూ ఉండవలసిందిగా చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీధర్, హెచ్ఈఓ వేణుగోపాలకృష్ణ, హెచ్ ఎస్ ప్రసాద్, ఏఎన్ఎం సమ్మక్క, ఆశ కార్యకర్త లావణ్య తదితరులు పాల్గొన్నారు.
