మన్యం న్యూస్: జూలూరుపాడు, ఆగస్టు 02, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కేటాయించిన నూతన 108 వాహన సేవలను బుధవారం వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా, ప్రజలకు అత్యవసర సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా 466 నూతన వాహనాలను మంగళవారం హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వద్ద జెండా ఊపి ప్రారంభించారని తెలిపారు. వాటిలో 204 108 వాహనాలు కాగా, 228 అమ్మఒడి 102 వాహనాలనీ, 34 హర్సె పార్థివ వాహనాలు ఉన్నాయని ఎమ్మెల్యే రాములు నాయక్ తెలిపారు. మండల ప్రజలకి ఏ సమయంలో ఆపదవచ్చిన 108కి ఫోన్ చేసి ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఉచిత సేవలను వినియోగించుకోవాలని కోరారు.
కార్యక్రమంలో సర్పంచ్ గుండె పిన్ని విజయ, ఎంపీటీసీ పెండ్యాల రాజశేఖర్, చౌడం నరసింహారావు, రామిశెట్టి రాంబాబు, వైద్యాధికారులు రాకేష్, వెంకటేశ్వర్లు, ప్రదీప్తి, రాజేందర్, శ్రీదేవి, హెల్త్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.