- అసైన్డ్ పట్టాలకు హక్కుపత్రాలు ఇప్పించాలి..
- మండలంలోని సమస్యలపై ప్రభుత్వ విప్ రేగా కాంతారావు దృష్టికి తీసుకెళ్లిన బిఆర్ఎస్ బృందం..
మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఆగస్టు 02::
గిరిజన రైతులకు సంబంధించిన అసైన్డ్ పట్టాలకు హక్కుపత్రాలు ఇప్పించాలని దుమ్ముగూడెం మండల బిఆర్ఎస్ బృందం, పార్టీ ప్రజాప్రతినిధులు బుధవారం మండలంలోని పలు సమస్యలపై ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగ కాంతారావు దృష్టికి తీసుకెళ్లారు. మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారిని మర్యాదపూర్వకంగా కలిసి అసైన్ భూములకు సంబంధించిన సర్వే నంబర్లు పత్రాలను ఆయనకి అందించారు. అలానే మండలంలోని పోడు సర్వే నిర్వహించి పట్టాలు రాని పోడు సాగుదారులు కూడా పట్టాలు ఇప్పించాలని అన్నారు. పెదనల్లబల్లి గ్రామానికి చెందిన పోడు సాగుదారులకు గ్రామపంచాయతీ సెక్రటరీ నిర్లక్ష్యం కారణంగా ఆన్లైన్ కానీ పోడు భూములకు కూడా పట్టాలు ఇప్పించాలని కోరారు. మండలంలోని పలు సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి తను అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు తీసుకెళ్లి ప్రజా క్షేత్రంలో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేసు లక్ష్మి, మండల కార్యదర్శి కనితి రాముడు, అధికార ప్రతినిధి ఎండి జానీ పాషా, సర్పంచులు ఇర్పా చంటి, మట్ట వెంకటేశ్వరరావు, సోడి జ్యోతి, సుమిత్ర, ఎంపిటిసి తెల్లం భీమరాజు, పర్ణశాల ఉపసర్పంచ్ వాగే ఖాదర్ బాబు, నాయకులు లక్ష్మణ్, దామెర శ్రీనివాసరావు, కడియం సుబ్బారావు, గంగరాజు, వాగే రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.