UPDATES  

 సారు.. సల్లగుండాలి

  • సారు.. సల్లగుండాలి
  • సీఎంకు థ్యాంక్స్ చెప్పిన ప్రభుత్వవిప్ రేగా, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియ, ఉపేందర్ రెడ్డి, రాములు నాయక్
  • రుణమాఫీ.. రైతు హ్యాపీ
  • రైతుబాంధవుడికి జేజేలు
  • ఊరూరా పాలాభిషేకాలు.. పటాకుల సంబురాలు

మన్యంన్యూస్ ప్రతినిధి, హైదరాబాద్, భద్రాద్రి

సారు.. సల్లగుండాలి అని రుణమాఫీతో హ్యాపీగా ఉన్న రైతాంగం కోరుకుంటోందని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ ను కలిసి రైతుల స్పందన తెలిపారు. తెలంగాణ‌లో రైతుల రుణ‌మాఫీ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. రుణ‌మాఫీ చెల్లింపుల‌కు ఆర్థిక శాఖ నుంచి రూ. 167.59 కోట్లు విడుద‌ల‌య్యాయి. గురువారం రూ. 37 వేల నుంచి రూ. 41 వేల మ‌ధ్య ఉన్న రైతుల రుణాలు మాఫీ అయ్యాయి. దీంతో 44,870 మంది రైతుల‌కు ల‌బ్ధి చేకూరింది. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ప్రభుత్వవిప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, రాములు నాయక్, హరిప్రియలు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా రైతుల త‌ర‌పున ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా సంబురాలు
సీఎం కేసీఆర్ రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయడంతో భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా రైతన్నలు ఆనందంలో మునిగిపోయారు. పటాకులు కాల్చి, స్వాట్లు పంచి సంబురాలు చేసుకున్నారు. పాలాభిషేకాలు చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !