మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
రోజురోజుకు టమాట ధర దడపుట్టిస్తోంది. ఏకంగా రూ.200 ధర పలుకుతుండటంతో
యోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు కిలో ధర రూ.150 పలుకగా ప్రస్తుతం 200 వరకు చేరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత వేసవిలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావటంతో ఎకరాల్లో టమాటా పంట పూత రాలి దెబ్బ తిందని, ఈ ఏడాది వర్షాల కారణంగా టమాట సరఫరా కొరత ఏర్పడిందని కొంతమంది వ్యాపారులు పేర్కొంటున్నారు. దీంతో టమట ధర అధికంగా పెరుగుతుందని అంటున్నారు.