మన్యం న్యూస్ చండ్రుగొండ ఆగస్టు 3 : మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల నందు గురువారం మండల స్థాయి తొలిమెట్టు తెలుగు భాష సామర్థ్యం పై జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ నాగరాజ శేఖర్ సందర్శించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శిక్షణ పొందిన ఉపాధ్యాయులు దానిని తరగతి గదిలో సక్రమంగా అమలు చేయాలని, శిక్షణలో వచ్చిన మాడ్యూల్స్ వర్క్ బుక్స్, పాఠ్యపుస్తకాలను సమన్వయం చేసుకుంటూ బోధన చేయాలని, పాఠశాలలోని లైబ్రరీ పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలని, పాఠశాలకు వచ్చిన దగ్గర నుండి బయటకు వెళ్లే వరకు సెల్ ఫోన్లు వినియోగించరాదని, విద్యార్థులందరికీ ఈ అకాడమిక్ సంవత్సరం పూర్తి అయ్యోలోగా ధారాళంగా చదవడం, తప్పులు లేకుండా నేర్పించాలని, తొలిమెట్టు కార్యక్రమం ఈనెల 2 నుండి 8 వరకు ఉపాధ్యాయులకు శిక్షణ ఉంటుందని, ఈ శిక్షణను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకొని విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖధికారి సత్యనారాయణ, తొలిమెట్టు మండల నోడల్ అధికారి సంజీవరావు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు ఆనంద్ కుమార్, మండల రిసోర్స్ పర్సన్స్ దేవరామ్, నరసింహారావు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, సి ఆర్ పి ఎస్ పరమేశ్వరరావు, సేవ్యా పాల్గొన్నారు.