మన్యం న్యూస్, అశ్వారావుపేట, ఆగస్టు, 03: అశ్వారావుపేట నియోజకవర్గం ఏర్పాటు ఎండ్లు గడిచినప్పటికి నియోజకవర్గంలో ఉండాల్సిన వసతులు కార్యాలయాలు లేవు. 2018 ఎన్నికలో గెలిచిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయ సహకారాలతో నియోజకవర్గంలో ఒకొక్కటిగా ఏర్పాటు చేస్తూ అభివృద్ది చేసుకుంటూ వెళ్తున్నారు. అందులో బాగంగా ఇటీవలే సెంట్రల్ లైటింగ్ మంజూరు చేయించగా గురువారం అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదగా జిఓ అందుకున్నారు. అలాగే నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు పట్ల ప్రజల హర్షణ వ్యక్తం చేస్తున్నారు.