UPDATES  

 జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం..

 

మన్యం న్యూస్ దుమ్మగూడెం ఆగస్టు 03::
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్భంగా మండలంలోని ములకపాడు, పర్ణశాల, నరసాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని 01 నుండి 19 సంవత్సరాల పిల్లలకు నులి పురుగు నిర్మూలన టాబ్లెట్లను అందించారు. డాక్టర్ పుల్లారెడ్డి ఆధ్వర్యంలో దుమ్ముగూడెం జిల్లా పరిషత్, కస్తూర్బా గాంధీ, డాక్టర్ రేణుక రెడ్డి ఆధ్వర్యంలో పర్ణశాల జిల్లా పరిషత్ స్కూల్, డాక్టర్ సుభాష్ ఆధ్వర్యంలో నరసాపురం హైస్కూల్లో పిల్లలకు టాబ్లెట్లను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నులి పురుగు కడుపులో ఉన్నట్లయితే కడుపులో నొప్పి ఉండి మందగించడం జరుగుతుందని, దానివల్ల పిల్లలు చురుకుదనం లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని పిల్లలకు రక్తహీనత తగ్గుతుందని అవగాహన కల్పించారు. పరిశుభ్రత అవగాహనతో నులి పురుగులు నివారించవచ్చని విద్యార్థిని, విద్యార్థులకు సూచించారు. దుమ్ముగూడెం జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎల్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పిల్లలకు టాబ్లెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం శంకర్, ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాసరావు, పర్ణశాల సర్పంచ్ వరలక్ష్మి, హెల్త్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !