మన్యం న్యూస్ బూర్గంపహాడ్:- బూర్గంపహడ్ మండల పరిధిలోని లక్ష్మిపురం గ్రామ పంచాయతీలో గల మహాత్మా గాంధీ జ్యోతి బాపులే బాలుర గురుకుల పాఠశాలలో మొరంపల్లి బంజర ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అధికారి డాక్టర్ సాహితి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నిర్ములన దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన బూర్గంపహాడ్ మండల జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత,ఈ కార్యక్రమన్ని ఉదేశించి ఆమె మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్య,పాఠ్య పుస్తకాలు,వసతి నీ అందిస్తుంది,ప్రతి విద్యార్థి కి మెరుగైన విద్యను అందించాలని ఆంగ్ల బోధనను కూడా అందుబాటులోకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందనీ,విద్యార్థులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగించుకొని మంచి విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాన్ని అధిరోహించాలని కోరుకున్నారు,ప్రత్యేకంగ ఏర్పాటు చేసిన జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం కార్యక్రమంలో విద్యార్థులందరు ప్రభుత్వం అందిస్తున్న టాబ్లెట్స్ ని వేసుకొవటం వలన పిల్లలలో ఉన్న జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుందని,కడుపు నొప్పి లాంటి సమస్యలు రాకుండా ఉంటాయని ప్రతి ఒక్కరూ టాబ్లెట్స్ వేసుకోవాలని చెప్పారు,విద్యార్థులకు టాబ్లెట్లు అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు,ఈ కార్యక్రమం లో పాల్గొన్న స్థానిక సర్పంచ్ నాగమణి మాట్లాడుతూ శరీరంలోని పేగుల్లో చేరిన నులిపురుగులకు ఒక్క అల్బెండజోల్ మాత్రతో చెక్ పెట్టవచ్చని,నులిపురుగుల వల్ల రక్తహీనత,నీరసం,కడుపులో నొప్పి వంటి ఇబ్బందులు ఎదురవుతాయి అని పిల్లల్లో నులిపురుగులను నివారించి ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు గురువారం నుంచి మూడు రోజుల పాటు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది అని ఈ మాత్రలతో నులి పురుగుల్ని “నులి”పేద్దాం అని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యని ఉపాధ్యాయులు,మరియు శ్రీనివాస స్కూల్ అధినేత కోటిరెడ్డి,ఆరోగ్య శాఖ సిబ్బంది,గ్రామ పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.