మన్యం న్యూస్ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదల కారణంగా ముంపు గురైన 48 కుటుంబాలకు గురువారం అల్లవారి గణపురం,వీరాపురం గుర్రాల బావి గ్రామాలలో ఏటూరు నాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదేశాల మేరకు,25 కేజీల బియ్యం,15 రకాల నిత్యావసర సరుకులు అందజేశారు.తక్షణ సహాయంగా ఐటిడిఏ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఐటీడీఏ జేడీఎం కొండలరావు,పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్,జూనియర్ అసిస్టెంట్ భాను ప్రకాష్, ఎంపీటీసీ సభ్యులు కోట నరసింహులు,సర్పంచ్ పలక చిన్నన్న గ్రామస్తులు పాల్గొన్నారు.
