మన్యం న్యూస్, మంగపేట.
రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ నెల 15 రోజుల్లో 19 వేల కోట్లు రైతు రుణమాఫీ పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో గురువారం మంగపేట మండలంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పెద్ద ఎత్తున రైతులతో బి ఆర్ ఎస్ ,పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటానికి పాలభిషేకం చేసిన సీనియర్ నాయకులు మంగపేట మండల పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ సర్పంచ్ కుడుముల లక్ష్మి నారాయణ.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఎన్ని అడ్డంకులు వచ్చినా రైతన్నలకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ణయించడం అత్యంత సంతోషకరమైన విషయమని అన్నారు.. ఇప్పటికే 17 వేల 351 కోట్ల రుణాలు మాఫీ చేయగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 29.61 లక్షల రైతుల కుటుంబాలకు 19 వేల కోట్ల రుణాలు మాఫీ నేలన్నర లోగా పూర్తి చేయాలని చెప్పడం గర్వించదగ్గ విషయమని అన్నారు..సమైక్య రాష్ట్రంలో దండగ అన్న వ్యవసాయాన్ని తెలంగాణ రాష్ట్ర సిద్ధించాక వ్యవసాయాన్ని పండుగలా చేసి చూపిన విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని అన్నారు.. ,రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతు బీమా తీసుకొచ్చి వారికి వెన్నుదండుగా ముఖ్యమంత్రి గారు నిలబడుతున్నారని అదేవిధంగా ప్రమాదవశాత్తు చనిపోయిన రైతన్నకు రైతు బీమా ద్వారా రైతుల కుటుంబాలకు లక్ష రూపాయిలు వారి కుటుంబాలకు అందజేయడం జరిగిందని అన్నారు .. ఆరు నూరైనా రైతన్న సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించేది కేవలం ఒక బిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని రాబోయే రోజుల్లో కూడా బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.