మన్యం న్యూస్, దమ్మపేట, ఆగస్టు, 03: తెలంగాణ ప్రభుత్వం రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ ప్రకటించడంతో రైతులు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు దానిలో భాగంగా మండల పరిధిలోని లచ్చాపురం మల్కారం గ్రామపంచాయతీలలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు అంకిత మహేశ్వరరావు సమక్షంలో బి ఆర్ ఎస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. గ్రామాలలో బైకు ర్యాలీ నిర్వహించి రైతు బాంధవుడు కేసీఆర్, జై తెలంగాణ, జై బిఆర్ఎస్ అంటూ ర్యాలీ భారీ స్థాయిలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంకిత మహేశ్వరావు మాట్లాడుతూ రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని క్యాబినెట్లో ప్రకటించడం సంతోషకరమైన విషయం అని అదేవిధంగా రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతు బీమా లాంటి సకల సౌకర్యాలు కల్పిస్తూ చిరస్థాయి ముద్ర వేసుకున్నారని, కాబట్టి వచ్చే ఎన్నికలలో కూడా బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తామని, స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మెచ్చా నాగేశ్వరావుని అత్యధిక మెజార్టీతో అసెంబ్లీకి పంపిస్తామని అయినా అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు రూబ్ సింగ్, తోట రాజు, నాయకులు బి కోటేశ్వరావు, టి జేమ్స్, ఆర్ వీరయ్య, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.