UPDATES  

 మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రి లో మెరుగైన సేవలు:జడ్పిటిసి పోశం.నర్సింహారావు

 

మన్యం న్యూస్ మణుగూరు: ఆగష్టు 03

మణుగూరు మండలం లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి లో మెరుగైన వైద్య సేవలు అందజేస్తున్నారు అని జడ్పిటిసి పోశం నర్సింహారావు తెలిపారు.ఈ మేరకు జడ్పిటిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం లో వారు జడ్పిటిసి పోశం మట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అధునాతన శస్త్ర చికిత్సలు కూడా విజయవంతం గా నిర్వహిస్తున్నారు అన్నారు. ఆసుపత్రి లో మొదటి టాన్సిలెక్టమి ఆపరేషన్ గురువారం విజయవంతం గా చేయడం జరిగింది వారు తెలిపారు.మణుగూరు చెందిన 9 సంవత్సరాల పాప దేవిక, ట్రాన్సి లైటిస్ గవద బిల్లలు తో బాధపడుతూ,మణుగూరు ఏరియా హాస్పిటల్ నందు అడ్మిట్ అయ్యింది అని, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాంప్రసాద్,ఈ.ఎన్.టి డాక్టర్ నరేష్,పేషెంట్ ను పరీక్షించి ఆపరేషన్ చేయుటకు నిర్ధారించి,టాన్సిలెక్టమి ఆపరేషన్ విజయవంతంగా చేయటం జరిగింది అన్నారు.ఈ ఆపరేషన్ లో డాక్టర్ నరేష్, డాక్టర్ రాం ప్రసాద్,స్టాఫ్ నర్స్ సరిత,స్వాతి,లాల్కన్,సతీష్ పాల్గొన్నారు.సాధారణంగా ఇలాంటి ఆపరేషన్ కోసం పేషంట్స్ ఇంతకు ముందు భద్రాచలం,కొత్తగూడెం,ఖమ్మం కు వెళ్ళేవారు అని,వేల కొద్దీ ఆపరేషన్ కొరకు ఖర్చు చేసే వారన్నారు.ఇప్పుడు మణుగూరు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఈ సేవలు ఉచితంగా లభించడంతో పేషంట్స్ వారి తల్లిదండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అన్నారు.ప్రభుత్వ విప్ రేగ కాంతారావు కు,కలెక్టర్ కు,డి సిహెచ్ఎస్ డాక్టర్. రవిబాబు కు,ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ ప్రసాద్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోశం. నరసింహారావు,సర్పంచ్ లు ఏనిక ప్రసాద్,తాటి రామకృష్ణ, బొగ్గం రజిత,కొమరం జంపేశ్వరి,వార్డ్ మెంబర్ ఎం. కిరణ్ కుమార్,బిఆర్ఎస్ పార్టీ నాయకులు కభంపాటి శ్రీను, ఇలాసాగరపు.రజిని తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !