UPDATES  

 రైతుబాంధవుడు సీఎం కేసీఆర్

  • రైతుబాంధవుడు సీఎం కేసీఆర్
  • ఇచ్చిన మాట ప్రకారం 19 వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫి
  • రైతుబందు, రైతుబీమా తో తెలంగాణ రైతాంగానికి స్వర్ణయుగం
  • ధాన్యం దిగుబడులతో దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ
  • రైతు సంక్షేమం, అభివృద్ది కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రత్యేక కృతజ్ణతలు:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

మన్యం న్యూస్ మణుగూరు:ఆగష్టు 03

రైతుబాంధవుడు సీఎం కేసీఆర్ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తెలిపారు.దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని విదంగా, ఏ ముఖ్యమంత్రి చేయని విదంగా రైతాంగ అభివృద్ది,సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారు.రైతులకు రుణమాఫీ కోసం కార్యాచరణ రూపొందించడం పట్ల హైదరాబాద్ అసెంబ్లీ లోని సీఎం ఛాంబర్ లో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్,రేగా కాంతారావు మాట్లాడుతూ,తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమంలో దేశం లోనే నెంబర్ వన్ అన్నారు.కరోనా వంటి విపత్కర పరిస్థితులు,ఎఫ్ఆర్బిఎం పరిమితులు,నోట్లరద్దు,జీఎస్టీ వంటి కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ఆదాయం పడిపోయినా తెలంగాణలో రైతుల కోసం నిరంతరాయంగా కృషి చేస్తున్నారన్నారు.నేడు 19వేల కోట్ల భారాన్ని భరిస్తూ తీసుకున్న రైతు రుణమాఫీ నిర్ణయం విప్లవాత్మకమన్నారు.తెలంగాణ రైతాంగ సంక్షేమం కోసం పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి 10వేల చొప్పున రైతుబందు అందజేయడమే కాకుండా,5 లక్షల రూపాయల రైతుబీమా, నాణ్యమైన ఉచిత కరెంటు, సకాలంలో నాణ్యమైన విత్తనాలు,ఎరువులతో పాటు వ్యవసాయానికి ముఖ్య అవసరమైన జలాలను కాళేశ్వరం ద్వారా అందుబాటులోకి తెచ్చి రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా,వ్యవసాయ వనరుగా, ధాన్యాగారంగా తీర్చిదిద్దారన్నారు.కేవలం 24.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ నుండి అనతి కాలంలోనే కొటిన్నర మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేసే విదంగా ఐదింతలు పంట దిగుబడులను పెంచిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు.తెలంగాణ రైతాంగం కోసం వారు పండించిన మొత్తం పంటను ఎంత నష్టమైనా భరించి వేల సంఖ్యలో కొనుగోలు కేంద్రాలను రైతుల చెంతనే ఏర్పాటు చేసి,కనీస మద్దతు ధరతో సేకరిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నారు.అన్ని రంగాలను అభివృద్ధి చేస్తూ,అన్నివిదాలుగా అండగా ఉంటున్న సీఎం కేసీఆర్ కు తెలంగాణ రైతాంగం పక్షాణ,రైతుబిడ్డగా తన తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !