మన్యం న్యూస్ బూర్గంపహాడ్:- తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల రికార్డులు కీలక చర్చనీయాంశాలుగా మారుతున్నాయి,రాష్ట్ర ప్రజల సంక్షేమమే ఎజెండాగా,అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో యావత్ దేశమే ఆశ్చర్యపోయే పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న తీరు సరిహద్దు రాష్ట్రాల్లో ప్రజల డిమాండ్లుగా మారనున్నాయనీ అభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి.రైతుబంధు,రైతుబీమా,ఆసరా పెన్షన్లు,కళ్యాణలక్ష్మీ,షాదీముబారక్,డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు తదితర పథకాలు దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీల ఎన్నికల ఎజెండాలో కీలక భాగస్వామ్యం కానున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నప్పటికి తెలంగాణలో రాజకీయం తిరొక్కవిధంగా వేడెక్కినప్పటికి బిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం వారి పని వారు చేసుకుంటూ 2023 విజయం మనదే అని దిమాగే ఉన్నారని చర్చలు నడుస్తున్నాయి.దేశానికే ఆదర్శంగా నిలిచిన మిషన్ భగీరథ,మిషన్ కాకతీయ పథకాలతో పాటు రైతుబంధు,రైతుబీమా పథకాల్లో మరింత పారదర్శకత పెంచి మిగిలిన ఉన్న లబ్ధిదారులందరినీ గుర్తించి న్యాయం చేసేలా సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపారనీ,పోడు దారుల ముఖంలో చిరునవ్వు చూపిన ఏకైక ముఖ్య మంత్రి కెసీఆర్ అని పినపాక ఎమ్మెల్యే,తెలంగాణ రాష్ట్ర విప్ రేగా కాంతరావు పలు సందర్భాల్లో వేదికల పై చర్చించారు.మిషన్ భగీరథతో ఉచితంగా ఇంటింటికి రక్షిత తాగునీటికి,ఇతర పథకాలకు సమయుగ్ర కుటుంబ సర్వే ఫలితాలను అమలు చేశారు.అదే సర్వే ఫలితంగా ఆసరా పెన్షన్లు,రైతుబీమా పథకాల్లో లబ్ధిదారుల సంఖ్య దాదాపు 20 శాతం కి పైగా పెరిగిందనీ చర్చించారు.ఈ క్రమంలో రైతు రుణమాఫీలు చేనిన సందర్భంగా బూర్గంపహాడ్ మండలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రైతుల పట్ల సహృదయంతో రైతుల రుణాలు మాఫీ చేశారు అని,ఈ విషయం తెలుసుకున్న రైతులందరు బూర్గంపహాడ్,మొరంపల్లి బంజర వేదికలలో సీఎం కేసీఆర్ కి,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కి ఆనందంతో పాలాభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో బూర్గంపహడ్ మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత ఆనంద ఉత్సాహంతో రైతుల కోరిక మేరకు పట్టు వదలని విక్రమార్కులకు పాలాభిషేకం చేశారు.అనంతరం పిఎసిఎఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బిజ్జం శ్రీనివాస్ రెడ్డి,సర్పంచులు,ఉప సర్పంచులు,గ్రామ కమిటీ అధ్యక్షులు,వార్డు మెంబర్లు,యువజన అధ్యక్షులు,మండల నాయకులు,మండల ఎస్సి సెల్ అధ్యక్షులు,బిసి మైనారిటీ సేల్ అధ్యక్షులు,పలువురు రైతులు,మహిళా రైతులు,
గ్రామ పెద్దలు,తదితరులు పాల్గొనీ పాలాభిషేకాలు చేశారు.