మన్యం న్యూస్: జూలూరుపాడు, ఆగస్టు 03, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులకు రుణమాఫీ ప్రకటించిన సందర్భంగా బిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో గురువారం జూలూరుపాడు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. టపాసులు పేల్చి, ఆనందం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంపిణీ చేశారు. రైతుల పక్షాన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధికారి ప్రతినిధి లాకావత్ గిరిబాబు, మండల పార్టీ కార్యదర్శి నున్నా రంగారావు, రైతుబంధు కన్వీనర్ యదలపల్లి వీరభద్రం, మాజీ మండల అధ్యక్షుడు చౌడం నరసింహారావు, రామిశెట్టి రాంబాబు, రోకటి సురేష్, వేల్పుల నరసింహారావు, చాపల మడుగు రామ్మూర్తి, దేవీలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.