మన్యం న్యూస్: జూలూరుపాడు, ఆగస్టు 04, ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని పాపకొల్లు క్రాస్ రోడ్డు ఆటో అడ్డా యూనియన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్స్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఆటో కార్మికులకు ఎటువంటి షరతులు లేకుండా బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని, కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో అడ్డ ప్రెసిడెంట్ పత్తిపాటి మహేష్, కార్యదర్శి గార్లపాటి వీరభద్రం, కనక పుడి నరసింహారావు, గార్లపాటి శివ, కృష్ణ, రామారావు, సుందరావు, కిరణ్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.