UPDATES  

 జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం కృషి మరువలేనిది – కేసిఆర్ కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మంత్రి కేటీఆర్ చేస్తున్న కృషి మరువలేనిదని అంతేకాకుండా ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సైతం జర్నలిస్టుల అందిస్తున్న సేవలను యూనియన్ నాయకులు కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ జర్నలిస్ట్ భవన్ కు స్థలాన్ని కేటాయించడంపై టియూడబ్లూజే(టీజేఎఫ్) యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కల్లోజి శ్రీనివాస్ మహ్మద్ షఫీ ఆధ్వర్యంలో కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు శుక్రవారం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ లోని అమరవీరుల స్థూపం వద్ద పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు.
ప్రభుత్వ పథకాల సమాచారం ప్రజల సమస్యలను వెలికి తీసి పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో నిధులు కేటాయించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు చండ్ర నరసింహారావు, టెంజు అధ్యక్షులు వట్టి కొండ రవి, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ జిల్లా అధ్యక్షులు చెంగపొంగు సైదులు, కార్యదర్శి అఫ్జల్ పఠాన్, సీనియర్ పాత్రికేయులు మోటమర్రి రామకృష్ణ, అచ్చి ప్రభాకర్ రెడ్డి, జిల్లా నాయకులు కనుకు రమేష్, శివ, రాజ్ కుమార్, నవీన్, భాస్కరాచారి, సురేష్, నాగరాజు, మురళి, చింతల చిరంజీవి, కనకారావు, జంపన్న, చదలవాడ సూరి, కిరణ్, వినోద్, రమేష్, ఆదాబ్ శ్రీను, దశరథ్, కలవ రాజా, మిలాప్ శ్రీను, రహీం తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !