UPDATES  

 కిన్నెరసాని ప్రధాన పైప్ లైన్ లీకేజీ!

కిన్నెరసాని ప్రధాన పైప్ లైన్ లీకేజీ!
– వృధాగా రోడ్డు పాలవుతున్న నీళ్లు
– అధ్వానంగా మారుతున్న జాతీయ రహదారి
– ఇబ్బంది పడుతున్న ప్రజలు
– ఆందోళన చేసిన ఫలితం శూన్యం

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
ఒక దిక్కు నీటిని పొదుపుగా వాడుకోవాలని మరో దిక్కు విద్యుత్ వాడకాన్ని ఆదా చేయాలని పదేపదే ప్రభుత్వ పాలకులు చెబుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా కిన్నెరసాని జలాలు రోడ్డుపాలై వృధాగా పోతున్నప్పటికీ పట్టించుకునే వారే కరువయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం టి ఎస్ ఆర్ టి సి షాపింగ్ కాంప్లెక్స్ ముందున్న జాతీయ రహదారి మధ్యలో కిన్నెరసాని ప్రధాన పైప్ లైన్ లీకై నీరు వృధాగా పోతూ రోడ్డు మొత్తం అద్వానంగా మారుతుంది. లీకేజ్ ప్రాంతం నుండి లీకైన నీళ్లు రైల్వే అండర్ బ్రిడ్జి మధ్యలో చేరి నిల్వ ఉండడం వల్ల ఇటు వాహనదారులు అటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల బిఎస్పి ఆధ్వర్యంలో లీకైన పైప్ లైన్ కు మరమ్మతులు చేయాలని కోరుతూ నిరసన తెలిపినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పైప్ లైన్ కు మరమ్మతులు చేసి నీరు వృధా కాకుండా చూడాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !