మన్యం న్యూస్: జూలూరుపాడు, ఆగస్టు 04, మండల పరిధిలోని కొమ్ముగూడెం గ్రామ పంచాయితీలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయ బాయి ఆధ్వర్యంలో శుక్రవారం మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో గడప గడపకు తిరుగుతూ అందరిని ఆప్యాయంగా పలకరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొస్తే రైతులకు, పేద ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను విజయ భాయి దృష్టికి తీసుకొచ్చారు. సానుకూలంగా స్పందించిన ఆమె త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, మన సమస్యలన్నీ తీరిపోతాయని అన్నారు. అనంతరం మండల కేంద్రంలో గత 30 రోజులుగా సమ్మె చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికుల శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. పంచాయతీ కార్మికులకు కనీస వేతనం అందించాలని, మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చెయ్యాలని, కార్మికుల న్యాయమైన కోరికలు ప్రభుత్వం తీర్చాలని అన్నారు. పంచాయతీ కార్మికులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. అనంతరం తను పంచాయితీ కార్మికులకు ఏర్పాటుచేసిన భోజనం వడ్డించి వారితో కలసి తిన్నారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి, ఎంపీటీసీ దుద్దుకూరి మధుసూదన రావు, ధారావత్ రాంబాబు, పోతురాజు నాగరాజు, తాళ్లూరి లక్ష్మయ్యతో పాటు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.