శాశ్వత పరిష్కారం చూపాలి
కొండాయి, దొడ్ల, మల్యాల లో తీవ్ర నష్టం
-మృతి చెందిన కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి.
-నష్టపోయిన ప్రతి ఇంటికి 2 లక్షలు ఇవ్వాలి
-నష్టపోయిన కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పక్కా ఇల్లు నిర్మించాలి.
-మృతుల కుటుంబాలకు 10,000 ఆర్థిక సహాయం అందించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు.
-మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి.
-వరదల ఉధృతికి నష్టపోయిన కుటుంబాలకు బియ్యం, దుప్పట్లు,చీరలు,బట్టలు అందజేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు,రాష్ట్ర కమిటీ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు.
మన్యం న్యూస్ ఏటూరు నాగారం
లోతట్టు ప్రాంత ప్రజలకు శాశ్వత పరిష్కార మార్గంకి ప్రణాళికలు రూపొందించి వరద ముంపు భయం లేకుండా ప్రజల ప్రాణాలు కాపాడాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు, నేదునూరి జ్యోతి, ఆదూరి రమేష్ అన్నారు.ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని,కొండాయి,దొడ్ల,మల్యాల గ్రామంలో ఇటీవల వర్షాల ఉధృతికి ఈ గ్రామానికి చెందిన 9 మంది మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబాని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనoనేని సాంబశివరావు. రాష్ట్ర కమిటీ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావులు పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయల చొప్పున 9 కుటుంబాలకు 90 వేల రూపాయలు. ఏడు లక్షల రూపాయల విలువచేసే బియ్యం దుప్పట్లు చీరలు బట్టలు ఆర్థిక సాయం అందజేశారు.ఏటూరు నాగారం మండల కేంద్రంలోని పునర్వాస కేంద్రంను పరిశీలించి వరద బాధితులతో మాట్లాడారు. ఏటూరు నాగారం ఏఎస్పి సంకీర్త్ తో మాట్లాడి ముప్పు ప్రాంత పరిస్థితులు స్థితిగతులు తెలుసుకున్నారు. గిరిజన భవన్ పునర్వాస కేంద్రంలో మృతుల కుటుంబాలకుసిపిఐ రాష్ట్ర కార్యదర్శి.కూనంనేని సాంబశివరావు. ఏఎస్పీ సంకీర్త్ చేతుల మీదుగా పదివేల నగదు అందజేశారు.9 మంది కొండాయి ప్రాంతంలో చనిపోవడం చాలా బాధాకరమైన విషయమని ఇలాంటి విపత్తు భవిష్యత్తులో రాకుండా ముందే జాగ్రత్త పడేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ గ్రామంలో వర్షాలతో ఇల్లు పంట పొలాల్లో ఇసుకమెటలు వేయడం వల్ల పంటలు పండించుకోవడానికి మరియు వర్షాలతో శిధిలమైన ఇంట్లో ఉండడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని ప్రజలతో నేరుగా మాట్లాడుతూ ఎవరు కూడా అధైర్య పడకూడదని ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇలాంటి సంఘటనలు రావడం చాలా దురదృష్టకరమని ఈ వర్షాల వల్ల పెద్ద సంఖ్యలో కుంటలు, చెరువులు,రోడ్లు,గ్రామలు,పట్టణాలు అతలాకుతలం అయి జలదిగ్బంధంలో చిక్కుకుని సర్వం కోల్పోయిన కుటుంబ సభ్యులకు కూలిపోయిన ఇండ్లకు 2 లక్ష రూపాయలు,పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు 50 వేల రూపాయలు. ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పునరావాస కేంద్రాలకు తరలించిన కుటుంబాలకు తక్షణమే సహాయం కింద ప్రభుత్వం వెంటనే ప్రతి కుటుంబానికి 20000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తూ సర్వస్వం కోల్పోయిన వీరికి తప్పకుండా మొదటి ప్రాధాన్యత ఇచ్చి డబుల్ బెడ్ రూమ్స్ ఇవ్వాలని ఈ వరదల వల్ల చాలా వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున శానిటేషన్,ఫామింగ్,వాటర్ నిల్వ లేకుండా చూడడం,నిల్వ ఉన్న వాటర్ లో ఘంభుజీయా ఫిష్ మరియు ఆయిల్ బాల్స్ వదిలిపెట్టడం,శానిటేషన్ పైన ప్రజలకు అవగాహన కల్పించడం,తక్షణమే నిరుపేద ప్రజలకు దోమతెరలు అందించడం,ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న నిరుపేదలకు మస్కిటో కైల్స్ ఇవ్వడం,ములుగు నియోజకవర్గంలో ఈ వరదల ఉధృతి వలన చనిపోయిన ప్రతి వ్యక్తికి ప్రభుత్వం వెంటనే 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని,ఇలాంటి పరిస్థితులు రానున్న కాలంలో పునరావృతం కాకుండా శాశ్వతమైన పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించుకోవాలని రానున్న కాలంలో ఖచ్చితంగా ఎవరైతే గృహాలను కోల్పోయిన కుటుంబాలకు ఇక్కడి పరిస్థితులను ప్రభుత్వాo దృష్టికి తీసుకొని పోయి పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని తెలిపారు. కేంద్ర బృందం ములుగు భూపాలపల్లి జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా ప్రభుత్వం హడావుడిగా కొంతమంది కుటుంబాలకే నష్టపరిహారంగా 10.000 అందించడం జరిగిందని పూర్తిస్థాయిలో అందరికీ వెంటనే నష్టపరిహారం సహాయం అందించాలని అన్నారు. వరదల్లో చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించడం కోసం ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. దొడ్ల, మల్యాల వాగుపై నిర్మించిన బ్రిడ్జి ఐదేళ్లకే కృంగిపోయి వరదలకు కూలిపోయి కొట్టుకపోవడం చూస్తే బ్రిడ్జి నిర్మాణం నాసిరకంగా చేపట్టడం జరిగిందని దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి నాయకులు నేదునూరి జ్యోతి, తోట మల్లికార్జునరావు, జంపాల రవీందర్, కొరిమి రాజ్ కుమార్, కర్రే బిక్షపతి, పంజాల రమేష్. కొరిమి సుగుణ, బండి నరసయ్య, అచంట ప్రసాద్, కృష్ణ, తోట బిక్షపతి, మల్యాల రాజు, వడ్డీ సారయ్య, ఆదూరి శ్రీనివాస్, ఎండి రజిమిన్, కృష్ణ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు దుర్గం రాజ్ కుమార్, రాజు వర్ధన్, కిరణ్
గ్రామ ప్రజలు,బాధితులు పాల్గొన్నారు.