మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- ఇల్లందు మండల ప్రత్యేకాధికారి జినుగు మారియన్న బొజ్జయిగుడెం గ్రామ పంచాయితీలో పర్యటించి పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలలో, ప్రభుత్వ పాఠశాలలో పర్యటించారు. గ్రామ పంచాయితీలో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. ఫ్రైడే డ్రైడే ప్రాముఖ్యతను విద్యార్థులకు ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వర్లు, పంచాయితీ కార్యదర్శి షర్మిల, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
