మన్యం న్యూస్ భద్రాచలం/చర్ల:
భద్రాచలం చుట్టుప్రక్కల వున్న విద్యార్థులకు ఉద్యోగస్తులకు ప్రజనీకానికి విజ్ఞాన విహారయాత్రల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. సెలవుల్లో విహార యాత్రలకు జగ్ధల్పూర్ దగ్గర వున్న అందమైన జలపాతాలు చిత్రకూట్ జలపాతాలు (ఇండియన్ నయాగరా ) మరియు తీరద్ గడ్ జలపాతాలు తిలకించుట కొరకై, మారేడుమిల్లి అందాలు, డొంకరాయి, పుష్ప బ్రిడ్జి, మోతుగూడెం హైడల్ ప్రాజెక్ట్, అందమైన ప్రాంతాలు దర్శించడం కొరకు భద్రాచలం డిపో నుండి తక్కువ ధరలకే బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. వివరాలకు ఎం వీర వెంకన్న విలేజ్ బస్సు ఆఫీసర్,టి ఎస్ ఆర్ టి సి, భద్రాచలం సెల్ 9553990399 సంప్రదించండి అని డిపో మేనేజర్ తెలిపారు.