కాంట్రాక్ట్ ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలి.
చలో అసెంబ్లీ ముట్టడి ని అడ్డుకున్న పోలీస్ లు
ఏఎన్ఎం లూ అరెస్ట్.
మన్యం న్యూస్ మణుగూరు:ఆగష్టు 04
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మండల పరిధిలో ఉన్ ఏఎన్ఎం లను ముందస్తుగా శుక్రవారం అరెస్టు చేశారు.కరోనా కష్టకాలంలో ప్రజల ప్రాణాలు నిలపటానికి మా ప్రాణాలను ఎదురు వడ్డీ కష్టపడిన మాకు తెలంగాణ ప్రభుత్వం అరెస్టులను బహుమానంగా ఇచ్చిందని మండలం లోని కాంట్రాక్టు ఏఎన్ఎంలు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఏఎన్ఎం లు మాట్లాడుతూ,గత 15 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ బేసిస్ లో పనిచేస్తున్న తమను ఎటువంటి పరీక్షలు లేకుండా రెగ్యులర్ చేయాలని పోరాటం చేస్తుంటే,తమ పోరాటాన్ని పట్టించుకోకపోగా జులై 26న ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని వారు తెలియజేశారు.ఆ నోటిఫికేషన్ లో కూడా గతంలో 2018లో నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు 30 మార్కులు వెయిటేజ్ ఇచ్చి ఇప్పుడు 20 మార్కులకు కుదించారన్నారు.వాస్తవానికి ఇప్పుడు 40 మార్కులు వెయిటేజీ ఇవ్వాల్సి ఉండగా సగానికి సగం కుదించటం ఏంటి అని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.నోటిఫికేషన్ రద్దు తో పాటు,కాంట్రాక్టు ఏఎన్ఎం లు అందరిని భేషరతుగా రెగ్యూలరైజ్ చేయాలని,శాంతియుతంగా చేస్తున్న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తుంటే,తమను తెల్లవారుజామునే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించటం దారుణమైన విషయం అన్నారు. మణుగూరు పిఎచ్ సి,జానంపేట పిఎచ్ సి లకు చెందన ఏఎన్ఎంలు పి. అనసూయ,పార్వతి,రాధ,విజయలక్ష్మి,వై.సుమలత లను గృహ నిర్భంధం చేయడం జరిగింది అని తెలిపారు.వారు మాట్లాడుతూ,కరోనా కష్టకాలంలో ప్రజల ప్రాణాలను నిలపటానికి తమ ప్రాణాలను ఎదురొడ్డి కష్టపడి పని చేసినందుకు తెలంగాణ ప్రభుత్వం తమకు అరెస్టులను బహుమతిగా ఇవ్వడం బాధాకరమైన విషయం అన్నారు.ఏఎన్ఎం లను రెగ్యులర్ చేసే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని, అధికారులు పోలీసులు బెదిరించిన భయపడే ప్రసక్తే లేదని భవిష్యత్తులో ఏఐటీయూసీ నాయకత్వం ఇచ్చే కార్యక్రమాలను విజయవంతం చేస్తామని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.అరెస్టయినా ఏఎన్ఎం ల ను బేషరతుగా విడుదల చేయాలని వారిపై ఎటువంటి కేసులు నమోదు చేయవద్దని ప్రభుత్వానికి,పోలీసులకు విజ్ఞప్తి చేశారు.మహిళలని కూడా చూడకుండా రాత్రి తెల్లవారుజామున అరెస్టు చేయటం ఏమిటని పోలీసులను ప్రశ్నించారు.ఇటువంటి చర్యలకు దిగితే రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.