సిపిఐ సీనియర్ నాయకులు మునిగిల.మల్లయ్య మృతి
సంతాపం తెలిపిన సిపిఐ రాష్ట్ర నాయకులు అయోధ్య.
మన్యం న్యూస్ మణుగూరు:ఆగష్టు 04
మణుగూరు మండలం,చిక్కుడుగుంట గ్రామానికి చెందిన సిపిఐ సీనియర్ నాయకులు మూనిగల.మల్లయ్య (95) అనారోగ్యం తో శుక్రవారం మృతి చెందారు.మరణ వార్త తెలియగానే సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.అయోధ్య మల్లయ్య పార్థివ దేహాన్ని సందర్శించి పార్టీ జెండాని కప్పి, పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బి. అయోధ్య మాట్లాడుతూ,పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే వారని, క్రమశిక్షణతో నిజాయితీగా ఉండేవాడని వారు అన్నారు.పార్టీ కి వారు చేసిన సేవలు మరువలేనివని,వారు మరణించడం దురదృష్టకరమని వారి ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు.వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.ఈ కార్యక్రమం లో మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మూన్న. లక్ష్మీకుమారి,ఎంపిటిసి కామిశెట్టి రామారావు,సిపిఐ మణుగూరు పట్టణ కార్యదర్శి దుగ్గ్యాల సుధాకర్, ఏఐటీయూసీ మణుగూరు మండల కార్యదర్శి అక్కి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.