మన్యం న్యూస్,ఇల్లందు:ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్వప్నికుడు ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ ఆదేశాల మేరకు పట్టణ మరియు మండల నాయకులు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అదేవిధంగా మున్సిపల్ కార్యాలయంలోనూ మున్సిపల్ ఛైర్మెన్ డీవీ ఆధ్వర్యంలో జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్మెన్ డీవీ, బిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధానకార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ..ఉమ్మడి పాలనలో నాడు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన నష్టాలను కష్టాలను వివరిస్తూ, తెలంగాణ రాష్ట్రఆకాంక్షలను, ప్రజల్లో ఉద్యమ భావాజాలాన్ని ప్రొఫెసర్ జయశంకర్ రగిలించారని వారు ఆయన సేవలను స్మరించుకున్నారు. జయశంకర్ స్ఫూర్తితో ఉద్యమాన్ని కొనసాగించి మొక్కవోని దీక్షతో సాహసోపేత పోరాటంచేసి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని వారు పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశించినట్టుగానే స్వయంపాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. సబండవర్ణాల సంక్షేమానికి పాటుపడుతూ సకలజనుల అభ్యున్నతిని సాధిస్తూ రాష్ట్రప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ కలను సాకారం చేస్తూ ముందుకు సాగుతోందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మండల ఎంపీపీ చీమల నాగరత్నమ్మ, వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్, చల్ల సముద్రం ఎంపీటీసీ పూనం లింగమ్మ, పట్టణ ఉపాధ్యక్షుడు అబ్దుల్ నబీ, ఎస్కే పాషా, మండల కోఆప్షన్ సభ్యులు ఎస్కే ఘాజీ, మండల ఉపాధ్యక్షుడు డేరంగుల పోశం, పట్టణ ప్రచార కార్యదర్శి మరియు సోషల్ మీడియా ఇంచార్జ్ గిన్నారపు రాజేష్, ఇంద్రనగర్ వార్డ్ నెంబర్ నీలం రాజశేఖర్, ప్రచార కార్యదర్శి రాచపల్లి శీను, పట్టణ నాయకులు తుంగపల్లి మహేష్, గండమల్ల రామకృష్ణ, డికొండ శివ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.