మన్యం న్యూస్ గుండాల: రోడ్డు ప్రమాదంలో గుండాల మండలానికి చెందిన ఇరువురు మృతిచెందగా మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. మండలం పరిధిలోని నరసాపురం తండా కు చెందిన కళ్యాణ్, గూగుల్ నితిన్, ముఖ్య చిన్న, హైదరాబాదు నుండి ద్విచక్ర వాహనంపై నరసపురం వస్తున్న క్రమంలో ములుగు సమీపంలో గల గట్టమ్మ తల్లి దేవాలయం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు
