మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
విద్యార్థి రెహాన్ ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం బస్టాండ్ చౌరస్తాలో విద్యార్థి బంధువులు స్నేహితులు ధర్నా నిర్వహించడం జరిగింది. న్యాయం చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధర్నా జరుగుతున్న సమయంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా వెంటనే డిఎస్పి ఆధ్వర్యంలో
బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థి ఆత్మహత్యపై విచారణ జరిపి న్యాయం చేసే విధంగా చూస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
